
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
జయపురం: తల్లి పేరున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ప్రకాశ్ చంద్ర పట్నాయక్ అన్నారు. పాఠశాలలో శనివారం మొక్కలు నాటారు. బ్లాక్ విద్యాధికారి చందన నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లి మనకు జన్మనిచ్చిందని, చెట్లు మన మనుగడకు ఆధారమన్నారు. మొక్కలు నాటి జీవ రాశి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
అటల్ యువ వాహినీ ఆధ్వర్యంలో..
పర్లాకిమిడి: బీజేపీ శ్రేణులు అటల్ యువ వాహినీ వింగ్‌ను ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక గజపతి స్టేడియంలో అటల్ యువవాహీని ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంతో మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాశీనగర్ సీనియర్ నాయకులు ఛిత్రి సింహాద్రి, రోక్కం రాంప్రసాద్, యువ మోర్చా నాయకులు కోట్ల యువరాజ్, దారపు చిట్టిబాబు, కృషక్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ పాలో, మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణిమా సాహు, కుమార్, సిద్ధేశ్వర మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి