
కొత్త కలెక్టర్‌ను కలిసిన జెడ్పీ ప్రెసిడెంట్
కొరాపుట్: ఇటీవల కొరాపుట్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యవాన్ మహాజన్‌ను జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వెనుకబడిన గిరిజన జిల్లా అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు.
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రి జిల్లా సమాచార, ప్రజాసంపర్క అధికారి ప్రమిళామాఝి గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల నివేదికను చదివి వినిపించారు. ఈ ఏడాది కూడా ఆమె నేతృత్వంలోనే దూమ్‌ధమ్‌గా నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం 7.30 నుండి ఎనిమిది గంటల్లోపు ప్రతి ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలపై జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం డీఎన్‌కే క్రీడా మైదానంలో నిర్వహించే జెండా ఆవిష్కరణ కోసం అతిథులను స్వాగతిస్తామన్నారు. ఈ ఏడాది పది, 12 తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను సత్కరించడం, పరేడ్ నిర్వహణపై చర్చించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీలో
ఉపాధ్యాయుడు అరెస్టు
రాయగడ: ఒడిశా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఓటీఈటీ) ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనకు సంబంధించి ఓ ఉపాధ్యాయుడిని ఒడిశా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రశ్నపత్రాలు లీకయ్యాయన్న వార్తలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఈ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. జిల్లాలోని మునిగుడ సమితి పరిధిలో గల డొంగొరొబొడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న బిజయ మిశ్రాను క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
బొగ్గు ఉత్పత్తిలో నంబర్ వన్
భువనేశ్వర్: బొగ్గు ఉత్పత్తి రంగంలో జాతీయ స్థాయిలో ఒడిశా అగ్రగామిగా నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 269.36 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. 254.63 మిలియన్ టన్నుల బొగ్గు ్జ పలు ప్రాంతాలకు ఎగుమతి చేసింది. గత మూడు సంవత్సరాలలో ఏ విద్యుత్ ప్లాంట్ బొగ్గు కొరతను ఎదుర్కొలేదు. ఒడిశాలో బొగ్గు ఉత్పత్తి పెరుగుదల దేశానికి ప్రయోజనకరంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి.కిషన్ రెడ్డి పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
భద్రక్‌లో పాఠశాలలకు సెలవు
భువనేశ్వర్: భద్రక్ జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ధామ్‌నగర్, తిహిడి, బాసుదేవ్‌పూర్ ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేశారు.

కొత్త కలెక్టర్‌ను కలిసిన జెడ్పీ ప్రెసిడెంట్

కొత్త కలెక్టర్‌ను కలిసిన జెడ్పీ ప్రెసిడెంట్

కొత్త కలెక్టర్‌ను కలిసిన జెడ్పీ ప్రెసిడెంట్