
అధికారుల తీరుపై అసంతృప్తి
జయపురం: సర్పంచ్‌లను అనేక విషయాలలో అధికారులు పట్టించుకోవటంలేదని కొట్‌పాడ్ సమితి సర్పంచ్‌ల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొట్‌పాడ్ సమితి సతరంగ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొట్‌పాడ్ సమితి సర్పంచ్ సంఘ సమావేశం బుధవారం జరిగింది. సంఘం అధ్యక్షుడు దేవ మఝి అధ్యక్షతన జరిగిన సమావేశం కొట్‌పాడ్ సమితిలోని అన్ని పంచాయతీల అభివృద్ధి, పంచాయతీ ప్రజలను అన్ని ప్రభుత్వ పథకాలలో మమేకం చేసే విషయంపై చర్చించింది. సర్పంచ్‌లను అనేక రంగాలలో నిర్లక్ష్యం చేస్తున్నారని పలువరు సర్పంచ్‌లు సమావేశంలో వెల్లడించగా సంఘం తీవ్రంగా స్పందించింది. సర్పంచ్‌ల పట్ల అధికారుల తీరుపై సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొట్‌పాడ్ సమితిలో ఉద్యోగులు, ఇంజినీర్లతో సర్పంచ్‌లు మంచి సంబంధాలు కలిగి, అభివృద్ధి కార్యక్రమాలలో సహకరించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. పంచాయతీ సిబ్బంది సర్పంచ్‌లకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేయాలని విజ్ఞప్తి చేసింది. రానున్న రోజులలో పీఈఓల (పంచాయతీ కార్యనిర్వాహక అధికారి) అందరితో ప్రతి నెలా సమావేశం నిర్వహించాలని సర్పంచ్‌ల సంఘం నిర్ణయింది. పంచాయతీలలో అన్ని అభివృద్ధి పనులు సమైఖ్యంగా అందరం కలిసి చేయాలని, అందుకు సర్పంచ్‌లు అందరూ ఐకమత్యంగా ఉండి ప్రజల డిమాండ్‌లను ప్రభుత్వానికి తెలియజేయాలని సమావేశం తీర్మానించింది. ఇందుకు సర్పంచ్‌లు అందరూ సహకరించాలని అధ్యక్షుడు దేవ మఝి విజ్ఞప్తి చేశారు.