
ఒత్తిడి జయిస్తేనే విజయం
రాయగడ: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురైతే చదువుతో పాటు ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రాకేష్ రంజన్ పాడి అన్నారు. స్థానిక పితామహాల్‌లోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో బుధవారం మానసిక ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దన్నారు. మానసిక ఇబ్బందులను ముందుగానే గుర్తించి వాటి నివారణకు సహకరించాలని సూచించారు. టొల్ ఫ్రీ నంబరు 14416 ద్వారా కూడా సలహాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో నర్శింగ్ విభాగం అధ్యాపకులు పి.రవితేజ, సునీల్ కర్, ప్రణతిదాస్, హిమాన్షు బెహరా తదితరులు పాల్గొన్నారు.