
బోల్ భం భక్తుల వ్యాన్ బోల్తా
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ సమితి మహేంద్రగిరికి వ్యాన్‌లో సోమవారం సాయంత్రం గంజాం జిల్లా ఛత్రపురం నుంచి 20 మంది బోల్ భం భక్తులు వెళ్లారు. అక్కడ ౖగోకర్ణేశ్వర మందిరంలో మహాదేవుడిని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో బుర్‌ఖాత్ పాస్‌కు సమీపంలోని ఘాటి మలుపు వద్ద వ్యాను అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు బోల్ భం భక్తులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న గారబంద పోలీసులు సంఘటన స్థలానికి విచ్చేసి వారిని తొలుత గారబంద ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో చేర్చారు. అనంతరం పర్లాకిమిడి ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వారిలో శుభం ఆచార్య, డి.నారాయణరావులు తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి హుటాహుటిన తరలించినట్లు గారబంద పోలీసుస్టేషన్ ఐఐసీ ప్రశాంత నిసిక వెల్లడించారు. ఘటనతో మహేంద్రగిరి వెళ్లేదారిలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఆరుగురు భక్తులకు గాయాలు

బోల్ భం భక్తుల వ్యాన్ బోల్తా