
విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులకు గాయాలు
మల్కన్‌గిరి:
జిల్లాలోని చిత్రకొండ సమితి కేంద్రంలో మంగళవారం ఇద్దరు యువకులు విద్యుత్ షాక్‌తో గాయాలుపాలయ్యారు. త్రినాథ్ ఖీలో, ఉద్దవ్ దాస్‌నాగ్ అనే ఇద్దరు యువకులు ఒక భవనంపై నుంచి సెల్ఫీ తీసుకున్నారు. అయితే అదే సమయంలో భవనంపై నుంచి వెళ్తున్న 33 కేవీ విద్యుత్ తగలడంతో పైనుంచి కింద పడిపోయారు. దీంతో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఉద్ధవ్ దాస్‌కి పరిస్థితి విషమంగా ఉండడంతో మల్కన్‌గిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు చికిత్సను అందజేస్తున్నారు .

విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులకు గాయాలు