
అదుపుతప్పిన పికప్ వ్యాన్
రాయగడ: జేకేపూర్ నుంచి రాయగడ వైపు వస్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపుతప్పి సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రం ప్రహరీని ఢీకొంది. దీంతో అంగన్‌వాడీలో ఉన్నటువంటి చిన్నారులు భయపడ్డారు. అయితే ఘటన స్థలంలోనే వ్యాన్‌ను వదిలి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం జేకేపూర్ నుంచి రాయగడ వైపు వెళ్తున్న పికప్ వ్యాన్ నాయుడుపేట వద్ద ఎదురుగా వస్తున్న ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొనబోయి అదుపుతప్పింది.