
దర్జాగా ప్రభుత్వ స్థలం కబ్జా
టెక్కలి: కోటబొమ్మాళి మండల కేంద్రంలో ప్రకాశ్‌నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ కార్యకర్తలు కొంత మంది దర్జాగా అక్రమ నిర్మా ణం చేస్తున్న విషయం అధికారులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు నివ్వెరపోతున్నారు. రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటంతో కాలనీవాసులు స్పందించి సర్పంచ్ కాళ్ల సంజీవరావు సహకారంతో మంగళవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడ మే కాకుండా ఆందోళన చేపట్టారు. ప్రకాశ్‌నగర్ కాలనీలో కొంత మంది అధికార పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆందోళన బాట పడతామంటూ హెచ్చరించారు.