
జె.ఆర్.పురంలో వ్యాన్ బీభత్సం
రణస్థలం: రణస్థలంలో జాతీయ రహదారిపై ఐషర్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం వైపు నుంచి నరసన్నపేట వెళ్తున్న ఈ వ్యాన్ మంగళవారం సాయంత్రం దన్నానపేట వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న ఈసర్ల రాంబాబు అనే వ్యక్తిని ఢీకొట్టింది. కొంతదూరం ముందుకొచ్చి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా అత్యంత రద్దీగా ఉండే రామతీర్థాలు కూడలి వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వ్యాన్ ఆగకపోతే పెను ప్రమాదం జరిగేది. జె.ఆర్.పురం పోలీసులులు స్పందించి జేసీబీ సాయంతో వ్యాన్‌ను పక్కకు నెట్టారు. ఈ ఘటనలో లావేరు మండలం పైడియ్యవలసకు చెందిన ఈసర్ల రాంబాబుకు తీవ్ర గాయాలు కావడంతో రణస్థలం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ, రెండు బైకులను ఢీకొట్టిన వైనం
డ్రైవర్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు