
ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అరెస్టు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని ఎచ్చెర్ల మండలానికి చెందిన ఎంపీపీ మొదలవలస చిరంజీవిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం వేకువఝామున ఫరీదుపేటలోని ఆయన స్వ గృహానికి జిల్లా పోలీసుల సహకారంతో ఒడిశా పోలీసులు చేరుకుని వారెంటు చూపించి అరెస్టు చేసినట్లు జేఆర్ పురం సీఐ అవతారం పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. 1999లో ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దమన్‌జోడి పోలీస్ స్టేషన్ పరిధిలో నాల్కో కంపెనీ తరఫున కాంట్రాక్ట్ పనులు చేయించారని, వ్యాపార లావాదేవీల్లో అక్కడ గొడవ రావడంతో చిరంజీవిపై కేసు నమోదైందన్నారు. చిరంజీవిని రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు.
‘కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన రహదారు లు, భవనాల శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌తో కలసి ఆయన నూతన కలెక్టరేట్ భవనాన్ని, అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యతపై ఎక్కడా రాజీ పడకూడదన్నారు.