
138 కేసులు పరిష్కారం
జయపురం: ఒడిశా న్యాయ సేవా ప్రదీకరణ ఆదేశం మేరకు కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు సోమవారం కొరాపుట్ జిల్లా స్థాయి లోక్ అదాలత్‌ను నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఎన్‌ఐ చట్టపు కేసులు మాత్రమే పరిష్కరించారు. ఎన్‌ఐ చట్టం సెక్షన్ 138 కేసులను ఉభయ వర్గాల మధ్య అవగాహన కల్పించి వారి సమ్మతితోనే కేసులు పరిష్కరించారు. జిల్లా జడ్జి, జిల్లా న్యాయ ేసేవా ప్రదీకరణ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మహంతి, సివిల్ కోర్టు రిజిస్ట్రార్ విష్ణు ప్రసాద్ దేబత, శాశ్వత లోక్ అదాలత్ విచారపతి ప్రద్యోమయి సుజాత, సబ్ డివిజనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతోష్ కుమార్ బారిక్, ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హరమోహణ దాస్ కేసులను పరిష్కరించారు. జిల్లా స్థాయి లోక్ అదాలత్‌లో 49 ఎన్‌ఐ కేసులలో 12 కేసులు పరిష్కరించి రూ.37,45,777 జరిమానా రూపంలో వసూలు చేసినట్లు ప్రద్యోమయి సుజాత వెల్లడించారు.