
నిరాహార దీక్ష
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ ప్రభుత్వ ఎస్.ఎస్.డి (ఆశ్రమ) ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవంత్సరంలో చేపట్టిన అడ్మిషన్లలో ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ సాహుకార్ అనేక అవకతవకలకు పాల్పడ్డారని సర్పంచ్ దీప్తీ ప్రభాలాల్ శోబోరో కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష సోమవారం చేపట్టారు. హెచ్‌ఎం సురేష్ సాహుకార్ వల్ల అనేక మంది ఆదివాసీ, దళిత విద్యార్థులు అడ్మిషన్లు పొందకుండా మిగిలిపోతున్నారని మాజీ సర్పంచ్ ఆరోపించారు. 2022లో కూడా దళిత, అదివాసీ అనాథ విద్యార్థులు ఇద్దరిని సెలక్షన్ లిస్టులో తొలిగించిన ఉదంతం జిల్లా సంక్షేమ శాఖ అధికారికి విన్నవించినా పాఠశాల హెచ్‌ఎంపై అధికారులు చర్యలు చేపట్టలేదని మాజీ సర్పంచ్ దీప్తి ప్రభాలాల్ శోబోరో తెలిపారు. జిల్లా కలెక్టర్ మధుమిత రాయఘడ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంపై తగిన చర్యలు చేపట్టాలని కోరారు.