
గ్రీవెన్స్‌సెల్‌కు 48 వినతులు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ అమెడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ మధుమితతోపాటు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, డీఎఫ్‌వో కె.నాగరాజు, ముఖ్యకార్యనిర్వాహణాధికారి (జిల్లా పరిషత్తు) శంకర కెరకెటా, ఐటీడీఏ పీవో అంశుమాన్ మహాపాత్రో, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు హాజరయ్యారు. అంగార్‌సింగి, లోబ, అమెడా, పోత్తురో గ్రామ పంచాయతీల నుంచి 48 వినతులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. వీటిలో వ్యక్తిగతం 19, గ్రామ సమస్యలపై 29 వినతులు ఉన్నాయి. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని కలెక్టర్ అధికారులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులకు గుర్తింపుకార్డులను అందజేశారు. అనంతరం రాయఘడ బ్లాక్ ఆవరణలో కలెక్టర్ మొక్కలను నాటారు. రాయఘడ సమితి అధ్యక్షురాలు పూర్ణబాసి నాయక్, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌సెల్‌కు 48 వినతులు

గ్రీవెన్స్‌సెల్‌కు 48 వినతులు