
పూర్వ విద్యార్థుల ఔదార్యం
వజ్రపుకొత్తూరు: గోవిందపురం ఉన్నత పాఠశాలలో 1989–1990 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదవిన పూర్వ విద్యార్థులు ఔదర్యాన్ని చాటుకున్నారు. తోటి మిత్రుడు రవిశంకర్ పాడి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుకుసున్న స్నేహితులు రూ. 30 వేలు సేకరించారు. ఈ మొత్తాన్ని ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా నవరంగాపూర్ బ్లాక్ అంబోధరలో ఉంటున్న అతని ఇంటికి సోమవారం వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మద్దిల హరినారాయణ, బొడ్డేపల్లి మోహన్, కీలు లోకనాథం, పుచ్చ అప్పలస్వామి, జామి మధు ఉన్నారు.