
ఘనంగా సహీద్ దినోత్సవం
రాయగడ: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ వ్యవస్థాపకుడు చారుమజుందార్ 53వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొలనార సమితి పరిధి కెరేడీ గ్రామంలో సహీద్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి గొమాంగో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేరేడి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మజూందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దళిత, బడుగు వర్గాల అభ్యున్నతికి మజూందార్ పోరాడారని గుర్తు చేశారు.