
ఇసుక అక్రమ రవాణాపై రైతుల కన్నెర్ర
కొత్తూరు: కొత్తూరు మండలంలోని బలద ఇసుక ర్యాంపు పేరుతో వసప గ్రామం సమీపంలో వంశధార నది వద్ద నిర్వహిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రైతులు సోమవారం కన్నెర్ర చేశారు. భారీ వాహనాలు తమ పొలాల దారి మీదుగా వెళ్తుండడంతో నిత్యం భయపడుతున్నామని తెలిపారు. ఇసుక టిప్పర్లు వెళ్లకుండా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు. ఇసుక వాహనాల రాకపోకల వల్ల తాము కనీసం బైక్‌పై ఎరువులు కూడా తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సంఘీభావం తెలపడం విశేషం. బలద రెవెన్యూ పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపు నిర్వహించాలని ప్రభు త్వం మంజూరు చేస్తే వసప గ్రామం వద్ద ర్యాంపు నిర్వహించడం తగదన్నారు. ఇసుక ర్యాంపును నిలుపుదల చేయాలని తహసీల్దార్‌ను ఫోన్‌లో కోరారు.
వసపలో ఇసుక వాహనాలు అడ్డుకున్న రైతులు
అక్రమ తవ్వకాలు ఆపాల్సిందేనని డిమాండ్