
నదిలో మునిగి బోల్‌భమ్ భక్తుడు మృతి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి భీమ్‌పూర్ పంచాయతీలోని దీనబంధుపూర్ వద్ద గల మహేంద్రతనయ నదిలో మునిగి బోల్‌భం భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు గజపతి జిల్లా నువాగడ సమితి కేజాలర్‌సింగ్ గ్రామానికి చెందిన కన్హా బొడొదలాయి (24)గా గుర్తించారు. సొమవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. బోల్‌భమ్ దీక్షను తీసుకున్న 30 మంది భక్తులు సొమవారం వేకువజామున భీమపూర్‌లోని శివుని మందిరానికి వెళ్లి జలంతో అభిషేకం చేసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో బొడొదలాయి కూడా భక్తులతో పాటు అక్కడకు వెళ్లాడు. అంతా నదీలో స్నానాలు చేసుకుని జలాలను కలశంతో పట్టుకుని సిద్ధంగా ఉన్న సమయంలో బహిర్భూమికని వెళ్లిన బొడొదలాయి ఇంకా తిరిగి రాకపొవడంతో భక్తులు అనుమానించి నదిలో మునిగిపొయినట్లు గుర్తించి సమీపంలోని గ్రామస్తులను సహాయం కొరారు. దీంతొ కొందరు గ్రామస్తులు నదిలో దూకి సుమారు రెండు గంటలపాటు వెతికి బొడొదలాయి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు.

నదిలో మునిగి బోల్‌భమ్ భక్తుడు మృతి

నదిలో మునిగి బోల్‌భమ్ భక్తుడు మృతి