
మల్కన్‌గిరి ప్రజలు సౌమ్యులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ప్రజలు ఎంతో సౌమ్యులని కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ అన్నారు. బదిలీపై వెళ్తున్న ఆయనకు సిబ్బంది సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ అధ్యక్షతన వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌గా 11 నెలలు అందించిన సేవలను వివిధ శాఖల అధికారులు కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పటేల్ చేసిన కృషిని ప్రశంసించారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేయందుకు చేసిన కృషిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ మాట్లాడుతూ.. మల్కన్‌గిరి జిల్లాలో పని చేసింది కొద్ది నెలలైనప్పటికీ తన హృదయంలో ప్రత్యేకంగా నిలిచిందన్నారు. అమాయక గిరిజనుల ప్రేమ, గౌరవం ఎప్పటికీ గుర్తుగా ఉంటుందన్నారు. కార్యాలయ సిబ్బంది ఎంతోగానో సహకరించారన్నారు. అందరి సహకారంతోనే జిల్లాను అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ డివిజన్ అధికారి సాయికిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధన్, జిల్లా అభివృద్ధి అధికారి నరేశ్‌చంద్ర పటేల్, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోధన్ బఓణి, జిల్లా అదనపు ఎస్పీ రష్మి రంజన్ సేనపతి తదిరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్
ఘనంగా వీడ్కోలు పలికిన సిబ్బంది

మల్కన్‌గిరి ప్రజలు సౌమ్యులు

మల్కన్‌గిరి ప్రజలు సౌమ్యులు