
ఖుర్దారోడ్ కొత్త డీఆర్‌ఎంగా అలోక్ త్రిపాఠి
భువనేశ్వర్: అలోక్ త్రిపాఠి తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం కొత్త మండల రైల్వే అధికారి (డీఆర్‌ఎమ్)గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ హోదాలో అంకితభావంతో సేవలందించిన హెచ్‌ఎస్ బజ్వా నుంచి బాధ్యతలు స్వీకరించారు. 1974 జనవరి 12న జన్మించిన త్రిపాఠి 1999 సెప్టెంబర్ 20న భారతీయ రైల్వే సేవా రంగంలో అడుగు పెట్టారు. ఇంతకు ముందు అలోక్ త్రిపాఠి న్యూఢిల్లీలోని రైల్వే బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫ్రైట్ మార్కెటింగ్), నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జనరల్ మేనేజర్, అహ్మదాబాద్‌లో అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ (ఏఓఎం), వదోదరలో డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ (డీఓఎం) , పశ్చిమ రైల్వేలో ఏరియా రైల్వే మేనేజర్ (ఏఆర్‌ఎం), రాజ్‌కోట్‌లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (సీనియర్ డీసీఎం)గా , రాజ్‌కోట్ , రత్లాం ప్రాంతాల్లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ (సీనియర్ డీఓఎం)గా పలు హోదాల్లో కీలకమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు.