
భర్తృహరి మహతాబ్‌కు సంసద్ రత్న పురస్కారం
భువనేశ్వర్: కటక్ లోక్ సభ నియోజక వర్గం సభ్యుడు డాక్టరు భర్తహరి మహతాబ్‌కు సంసద్ రత్న పురస్కారం లభించింది. ఈ ఏడాది పార్లమెంటులో సంసద్ రత్న పురస్కారానికి అర్హత పొందిన 17 మంది సభ్యుల్లో ఆయన ఒకరు కావడం విశేషం. సభలో జరిగిన చర్చలు, లేవనెత్తిన ప్రశ్నలు, ప్రవేశ పెట్టిన బిల్లుల ఆధారంగా ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు.
నిత్యావసర సరుకుల
పంపిణీ
రాయగడ: సదరు సమితి పరిధిలోని మల్లిగా, కొత్తపేట పంచాయితీల్లో సుమారు వంద మంది నిరుపేద వృద్ధు మహిళలకు సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు రూ. 1500 విలువ చేసే బియ్యం, పప్పు, నూనె, బంగాళదుంపలు వంటి నిత్యావసరాల వస్తువులను ఆదివారం పంపిణీ చేశారు. సత్యసాయిబాబా 100 జయంతిని పురస్కరించుకుని అమృత కలషం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సమితి కన్వీనర్ ప్రసాద్ పట్నాయక్ తెలిపారు. పేదల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ అమృత కలషం వారి ఆకలిని తీర్చేందుకు ఎంతగానో దోహడ పడుతుందన్నారు. కార్యక్రమం అనంతరం సాయిభజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్న సమారాధన జరిపించారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో సాయి, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు.
కళింగ ఆటో గ్యారేజ్‌లో అగ్ని ప్రమాదం
రాయగడ: చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేకే రోడ్డులో ఉన్న కళింగ ఆటో సిండికేట్ గ్యారేజీలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా మరో రెండు వాహనాలు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. దాదాపు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటల సమయం వరకు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మహిళా మావోయిస్టు
లొంగుబాటు
రాయగడ: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళా మావోయిస్టు లొంగిపొయారు. లొంగిపోయిన ఆమె శాంతి సికక వురఫ్ పారొ అని సమాచారం. రాయగడ జిల్లాలొని నియమగిరి పర్వతప్రాంతానికి చెందిన డొంగిరియా తెగకు చెందిన ఆమె 2015లో నాగావళి, వంశధార, ఘుంసూర మావోయిస్టుల దళంలో చేరింది. వివిధ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమెను పట్టుకున్న వారికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. రెండు రోజుల కిందటే ఆమె భర్త మాలూన్ పోలీసులకు లొంగిపోయారు. ముప్పై ఏళ్ల వయసులో ఆయన మావోలతో కలిసి పనిచేశారు. అక్కడ పరిచయం కావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ కార్యకలాపాల రీత్యా వేరు వేరు ప్రాంతాల్లో ఉండి విధులు నిర్వహిస్తుండేవారు. జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకుని ఇలా లొంగిపోయారు.

భర్తృహరి మహతాబ్‌కు సంసద్ రత్న పురస్కారం

భర్తృహరి మహతాబ్‌కు సంసద్ రత్న పురస్కారం

భర్తృహరి మహతాబ్‌కు సంసద్ రత్న పురస్కారం