
గజపతి జిల్లా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్‌గా మధుమిత పర్లాకిమిడి కలెక్టరేట్‌లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన బిజయకుమార్ దాస రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆదనపు శాసన కార్యదర్శిగా భుభనేశ్వర్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ మధుమితకు పలువురు ప్రభుత్వ అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను లబ్ధిదారులకు చేరువయ్యేలా కృషిచేస్తానని చెప్పారు. అలాగే సాధారణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించటంలో కూడా ముందుంటానని అన్నారు. కలెక్టర్ మధుమితను కలిసిన వారిలో జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ, ఏడీఎం. ఫాల్గునీ మఝి, జిల్లా పరిషత్తు సీడీవో శంకర కెరకెటా, రోడ్లుభవనాల శాఖ ఎస్‌ఈ అభిషేక్ శెట్టి, వాటర్ షెడ్ డిపార్టుమెంటు పీడీ సురేష్ పట్నాయక్ ఉన్నారు.

గజపతి జిల్లా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ