
అమ్మో ఇన్ని ఆస్తులా..?
జయపురం: జయపురం ఫారెస్టు డివిజన్‌లో డిప్యూటీ రేంజర్ రామచంద్ర నేపక్ తన ఆదాయానికి మించి 501 శాతం ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్లు కొరాపుట్ విజిలెన్స్ డివిజన్, జయపురం ఎస్పీ నరేంద్ర కుమార్ శనివారం సాయంత్రం జయపురం కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. అతడి ఇంటిలో రూ.1 కోటి 43 లక్షల 34 వేలతో పాటు బ్యాంకులలో బీమాలో డిపాజిట్‌లు రూ.1 కోటి 32 లక్షల 85 వేల 754 ఉన్నాయని తెలిపారు. జయపురం ఎస్‌కేటీ రోడ్డులో 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, 3 ప్లాట్‌లు, 2 హై వాల్యూ ప్లాట్‌లు, భువనేశ్వర్ యుఎమ్‌ఎస్ భాగభటి మాన్‌సన్ రఘునాథ్‌పూర్ జాలిలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3–బికెహెచ్ ప్లాట్, జయపురం ప్రసాదరావు పేట గోల్డెన్ హైట్ రెసిడెన్సియల్ అపార్ట్ మెంట్‌లో 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 బికెహెచ్‌కే ప్లాట్‌లు, 1.504 కేజీల బంగారం, 4.6 కేజీల వెండి, 2 నాలుగు చక్రాల కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, రూ.15.50 లక్షల విలువైన గృహ పరికరాలు కనుగొనటం జరిగిందని వెల్లడించారు. ఇంకా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.

అమ్మో ఇన్ని ఆస్తులా..?

అమ్మో ఇన్ని ఆస్తులా..?

అమ్మో ఇన్ని ఆస్తులా..?

అమ్మో ఇన్ని ఆస్తులా..?