
68 యూనిట్ల రక్తం సేకరణ
జయపురం: జయపురం రోటరీ క్లబ్ ఆఫ్ ఫ్రైడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌కేటీ రోడ్డు వాసవీ భవనంలో ఆదివారం స్వచ్ఛంద శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 68 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటలకు రోటరీ క్లబ్ అధ్యక్షులు సురేష్ పాణిగ్రహి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయండి ఇతరుల ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో శిబిరాలను తరచూ నిర్వహిస్తామని ప్రకటించారు. రక్తదానం చేసేవారికి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని, రక్త ప్రసరాన్ని పెంచుతుందని, కొత్త బ్లడ్ సెల్స్ పెరుగుతాయని, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వివరించారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని పిలుపు నిచ్చారు. శిబిరంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రబినారాయణ నంద, జయపురం సబ్‌డివిజన్ రక్త దాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కొంత సమయానికి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. సుమారు ఒక గంటపాటు రక్త దాతలకు ఇబ్బంది కలిగింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగిన శిబిరంలో అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి బ్లడ్‌బ్యాంకు అధికారి డాక్టర్ ఎస్.ఎస్.మిశ్ర నేతృత్వంలో టెక్నీషియన్‌లు అమలాన్ జ్యోతి, ప్రమోద్ ఖిలోలు దాతల నుంచి రక్తం సేకరించారు. విక్రమదేవ్ విశ్వ విద్యాలయ విద్యార్థులు, ఎన్‌సీసీ కేడెట్లు సహకరించారు. రక్త దాతలకు నిర్వాహకులు ప్రశంసా పత్రాలు అందజేశారు.

68 యూనిట్ల రక్తం సేకరణ

68 యూనిట్ల రక్తం సేకరణ