
విద్యుదాఘాతంతో మహిళ మృతి
రాయగడ: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన స్థానిక గాంధీనగర్ రెండో వీధిలో ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలు కె.భారతి (62)గా గుర్తించారు. ఉదయం ఆరు గంటల సమయంలో తడి బట్టలను మేడపై ఉన్న ఇనుప తీగపై ఆరవేస్తున్న సమయంలో విద్యుత్‌షాక్ తగిగి ఆమె కింద పడిపొయారు. బట్టలు ఆరవేసేందుకు వెళ్లిన ఆమె కిందకి దిగిరాకపొవడంతో మేడ మీదకు వెళ్లి చూసిన కుటుంబీకులకు భారతి ఆపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించిన కుటుంబీకులు ఆమైపె ఇనుప తీగ పడి ఉండడంతో విద్యుత్‌షాక్‌కు గురైనట్లు గుర్తించారు. సమీపంలో గల విద్యుత్ తీగను ఎలుక కొరికేయడంతో అది సరాసరి బట్టలు ఆరబెట్టేందుకు ఉన్న ఇనుప తీగపై పడిందని అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి