
సహాయ ప్రొఫెసర్ భార్యపై అత్యాచార యత్నం
భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ విశ్వ విద్యాలయం క్యాంపస్‌లో సహాయ ప్రొఫెసర్ భార్యపై అత్యాచార యత్నం జరిగింది. అధ్యాపకుల క్వార్టర్స్‌లోకి చొరబడి ఈ చర్యకు పాల్పడినట్లు ఆరోపణ. ఈ మేరకు బాధితురాలు రెముణా పోలీస్ ఠాణాలో ఈ ఫిర్యాదు చేసింది. నిందిత యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
క్యాంపస్ భద్రత పెంపు
సహాయ ప్రొఫెసర్ భార్యపై అత్యాచార యత్నం తర్వాత బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో భద్రతను పెంచారు. సంఘటన జరిగిన సమయంలో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డును తొలగించారు. ప్రతి గేటు వద్ద 2 మంది చొప్పున సెక్యూరిటీ గార్డులను నియమించారు. క్యాంపస్‌లో పనిచేసే కార్మికులు తమ ఆధార్ కార్డులను చూపించి లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. క్యాంపస్ భద్రత పటిష్టత కోసం ఏర్పాట్లు చేయాలని డీజీపీకి లేఖ రాస్తామని వైస్ చాన్స్‌లర్ తెలిపారు.