
లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. బాలికపై లైంగిక దాడి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం బాలికపై లైంగిక దాడి జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక ఒంటరిగా వస్తున్న సమయంలో ఓ యువకుడు బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి కొంతదూరం తీసుకెళ్లి నిర్మానుష్యమైన ప్రాంతలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆ సమయంలో రహదారి పక్కన ఓ చోట బాలిక ఏడుస్తూ కూర్చుంది. బాలిక మేనమామ బలిమెల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐఐసీ ధీరజ్ పట్నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాటేసిన నాగుపాముతో ఆస్పత్రికి..
భువనేశ్వర్: విష సర్పం కాటుతో గాయపడిన చేతికి గుడ్డ, మరో చేతిలో కాటేసిన 4 అడుగుల పొడవైన పాముతో ఓ యువకుడు ఆస్పత్రిలో ప్రత్యక్షం అయ్యాడు. యువకుని అవతారం చూసి అక్కడి వైద్యులు, సిబ్బంది అవాక్కయ్యారు. ఈ విచిత్ర సంఘటన అంగుల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిషా పోలీస్ ఠాణా పరిధిలోని కలియాకొట గ్రామస్తుడు బుబుల్ భోయ్ (25) పాము కాటుకు గురయ్యాడు. బంధువులలో ఒకరి ఇంట్లో చొరబడిన పామును పట్టుకునే ప్రయత్నంలో అతడి కుడి చేతికి గాయమైంది. విషపూరిత పాము కాటుకు గురైన తర్వాత ఆ పామును పట్టుకున్న వీడియోను రికార్డ్ చేసి స్వయంగా స్థానిక ఆస్పత్రికి చేరాడు. అతని ప్రాణాలకు ప్రమాదం ఉన్నందున ప్రథమ చికిత్స చేసి జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు.
బిడ్డకు జన్మనిచ్చిన
మైనర్ బాలిక!
● నిందితుడు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఘోరం జరిగింది. ఖోయిర్‌పూట్ సమితి ముదిలిపోడ పోలీసుస్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చినప్పటికీ కారణకులెవరో చెప్పకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. అయితే నెలలు నిండకముందు శనివారం మగ బిడ్డకు జన్మనివ్వడంతోపాటు కారకుడెవరో చెప్పడంతో తల్లిదండ్రులు మేల్కొన్నారు. ఆదివారం ముదిలిపోఢ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన యువకుడు బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొవడంతో అతన్ని అరెస్టు చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.