
పోలీసులకు చిక్కిన రీల్స్ సోగ్గాడు!
భువనేశ్వర్: నడి రోడ్డు మీద విలాసవంతమైన మోటారు సైకిల్‌పై తుపాకీ పట్టుకుని రీల్స్ చిత్రీకరిస్తున్న సోగ్గాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడి విన్యాసాలు పరిసరాల్లో తిరుగాడుతున్న ప్రజలను భయాందోళకు గురి చేస్తున్నాయని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఉత్సాహవంతమైన రీల్స్ చిత్రీకరణ ముగియక ముందే పోలీసులకు చిక్కాడు. అంగుల్ ప్రాంతం ప్రధాన రహదారిపై హెల్మెట్ లేకుండా రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తు చేతిలో తుపాకీ పట్టుకుని వీరత్వం ప్రదర్శించి ఒంటి చేతితో రాయల్ ఎన్‌ఫీల్డు గాలి వేగంతో నడుపుతూ వీడియో చిత్రీకరించాడు. ఈ దృశ్యాన్ని సాంఘిక మాధ్యమంలో ప్రసారం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి రీల్స్ హీరోని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువకుడు వినియోగించిన రాయల్ ఎన్‌ఫీల్డు వాహనం, వీరత్వ ప్రదర్శనకు వినియోగించిన బొమ్మ తుపాకీ స్వాధీనం చేసుకుని అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఖండపడా ఠాణా పోలీసులు తెలిపారు.

పోలీసులకు చిక్కిన రీల్స్ సోగ్గాడు!