
మహానది కోల్‌ఫీల్డ్‌తో జిల్లా యంత్రాంగం ఒప్పందం
రాయగడ: మహానది కోల్‌ఫీల్డ్ కంపెనీతో జిల్లా యంత్రాంగం మూడు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. అందుకు సంబంధించి కోల్‌ఫీల్డ్ కంపెనీ మేనేజరు సుబ్రజ్యోతి సాహుతో జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి శనివారం ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టారు. కంపెనీ సీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా రాయగడ జిల్లాలోని గిరిజన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచాలు, పరుపులు, ఇతరత్ర సౌకర్యాలు అందించడానికి సీఎస్‌ఆర్ నిధి కింద రూ. 4.5 కోట్లు ఖర్చు చేసేందుకు మహానది కోల్‌ఫీల్డ్ కంపెనీ ఒప్పందం చేసింది. ఈ మొత్తం వ్యయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ఖర్చు చేసేందుకు అవగాహన కుదుర్చుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని మునిగుడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సుమారు రూ. 58 లక్షలతో డయాల్సిస్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కోల్‌ఫీల్డ్ కంపెనీ అంగీకరించింది. దీని ద్వారా మునిగుడ పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతోమంది ప్రజలు మెరుగైన వైద్య సౌకర్యాలు పొందుతారు. జిల్లాలోని కాసీపూర్, పద్మపూర్ మునిగుడ సమితుల్లో గర్భిణుల ఆరోగ్య సంరక్షణతో పాటు వారికి సకాలంలో పౌష్టికాహారం అందించడం, అలాగే పిల్లలకు పౌష్టికాహారంతోపాటు వారి ఆరోగ్య భద్రతను మెరుగు పరిచేందుకు కంపెనీ తరఫున సమారు 3 కోట్ల 96 లక్షల 21 వేల రూపాయలను ఖర్చు చేసేందుకు అంగీకరించారు.