
ఉచిత నేత్ర వైద్యశిబిరం
రాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం, హింజిలికట్‌లోని శంకర్ నేత్ర వైద్యశాల సంయుక్తంగా శుక్రవారం స్థానిక కళింగ వైశ్య సంఘం కార్యాలయం ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన 85 మందికి వైద్యం అందించారు. శంకర్ ఐ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు డాక్టర్ హృషి కేష్ రథ్, క్యాంప్ మేనేజరు నళిని కాంత్ రౌత్, సిబ్బంది శుభశ్రీ తదితరుల నేతృత్వంలో నిర్వహించిన శిబిరంలో 13 మందికి నేత్ర పరీక్షలు చేసి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. వీరిని శంకర్ హస్పటల్‌కు చెందిన యాజమాన్యం ఖర్చులతో వారికి ఉచితంగా ఆపరేషన్లను నిర్వహిస్తారని శిబిరం నిర్వాహకులు కలింగ వైశ్యసంఘం అధ్యక్షులు కింతలి అమర్ నాథ్, కార్యదర్శి టంకాల జయరాం, సహకార్యదర్శి చిన్నారి విజయ్ మోహన్ తెలిపారు. కళింగ వైశ్య సంఘం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఇటువంటి తరహా ప్రజాహిత కార్యక్రమాలు భవిష్యత్‌లో మరిన్ని నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నామని అధ్యక్షులు అమర్ నాథ్ తెలిపారు.