
గజపతి కలెక్టర్ బిజయకుమార్ దాస్‌కు ఘనంగా వీడ్కోలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అదనపు శాసన కార్యదర్శిగా భువనేశ్వర్‌కు పదోన్నతిపై బదిలీ అవ్వడంతో ప్రభుత్వ ఉన్నత అధికారులు, కలెక్టరేట్, రెవెన్యూ, జిల్లా పరిషత్ సిబ్బంది వీడ్కోలు సభను ఆర్‌శెట్టి భవనంలో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్‌ను ప్రభుత్వ అధికారులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు సభకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫాల్గుణీ మఝి అధ్యక్షత వహించారు. కలెక్టర్ బిజయ కుమార్ దాస్ గజపతి జిల్లాలో 11 నెలల 15 రోజులు పనిచేశారు. ఆయన ఒక మిత భాషి అని, మంచి పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్నారని ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా అన్నారు. ఆయన 11 నెలల పరిపాలనలో అందరు అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయడమే కాకుండా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు అమలు జరిగాయని అన్నారు.

గజపతి కలెక్టర్ బిజయకుమార్ దాస్‌కు ఘనంగా వీడ్కోలు