
ప్రజల చెంతకు సహకార సేవలు
జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ల సమావేశం శుక్రవారం జరిగింది. కెసీసీ బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చంద్ర పాణిగ్రహి అధ్యక్షతన జయపురంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో బ్యాంక్ అమలు చేస్తున్న కార్యకలాపాలు.. వాటి ఫలితాలపై చర్చించారు. బ్యాంక్ సర్వాంగ ఉన్నతికి చేపట్టవలసి పనులపై మాట్లాడారు. అలాగే బ్యాంక్ చేపడుతున్న ప్రజాహిత పథకాలు ఖాతాదారుల చెంతకు చేర్చి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని నిర్ణయించారు. సమావేశంలో బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, భీమసేన్ సాహు, కార్యదర్శి అతుల్య కుమార్ మల్లిక్, బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హరిశ్చంద్ర బనాగడతో పాటు పలువురు డైరెక్టర్లు, బ్యాంక్ పరిశీలన కమిటీ సభ్యులు, బ్యాంక్ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.