
అంధకారంలో ఆశ్రమ పాఠశాల హాస్టల్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కదంగూడలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో చాలా కాలంగా విద్యుత్ సమస్య వేధిస్తోంది. హాస్టల్ సిబ్బంది విద్యుత్ శాఖకు ఫిర్యాధు చేస్తే.. ఏదో ఒక వైరు పేట్టి వారం రోజులు విద్యుత్ వచ్చేలా చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సమస్య మళ్లీ మొదలైంది. బుధవారం రాత్రి విద్యార్థులు చీకటిలోనే ఉన్నారు. గురువారం కొంతమంది విద్యార్థులు మట్లాడుతూ.. తమ పాఠశాల చుట్టూ పాముల భయం ఉందన్నారు. రాత్రి సమయంలో చీకటిల్లోనే భోజనాలు చేయాల్సి వచ్చిందన్నారు. సరిగా నిద్ర పట్టడం లేదన్నారు. తమకు ఏమైనా అయితే పూర్తి బాధ్యత ఉపాధ్యాయులుదేనేన్నారు. మోటారు లేక నీరు కూడా రావడంలేదని, రోజువారీ కార్యక్రమాలకు బయటకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వంటవారు గ్రామంలో బోరు నీరు తెచ్చి వంట చేస్తున్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

అంధకారంలో ఆశ్రమ పాఠశాల హాస్టల్

అంధకారంలో ఆశ్రమ పాఠశాల హాస్టల్

అంధకారంలో ఆశ్రమ పాఠశాల హాస్టల్