
గుడారి సమితి చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
రాయగడ: జిల్లాలోని అత్యంత ప్రాధాన్యత గల గుడారి సమితిలో రాజకీయాలు వేడెక్కాయి. సమితి చైర్‌పర్సన్ లక్ష్మీ సోభోరోపై అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు సబ్ కలెక్టర్ కిరణ్ దీప్ కౌర్ సహట ఆదేశానుసారం గురువారం సమితి కార్యాలయంలో ఓటింగ్ జరిగింది. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల వరుకు కొనసాగింది. తహసీల్దార్ ఎ.స్నేహలత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. సమితి ఈఓ ప్రసన్న కుమార్ పాడీ మేజిస్ట్రేట్‌గా వ్యవహరించారు. సమితి సభ్యులు, ఎంపి, ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 20 మంది ఓటర్లు ఉండగా.. 16 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేసేందుకు హాజరుకాలేదు. పోలీసుల బందోబస్తు మధ్య ఓటింగ్ జరిగింది. ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.

గుడారి సమితి చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం