
నర్సింగ్ విద్యార్థుల ప్రమాణ స్వీకారం
పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ కళాశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు గురువారం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డా.మహేంద్ర కుమార్ భుయ్యాన్ విద్యార్థులతో ప్రమాణం చేయించారు. నర్సింగ్ కోర్సును వృత్తిగా స్వీకరిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలని వైస్ ప్రిన్సిపాల్ (నర్సింగ్ స్కూల్) ప్రొఫెసర్ ఎస్.ఎన్.సంధ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నర్సింగ్ స్కూల్ డైరెక్టర్ ప్రొ.సునీల్ కుమార్ ఝా, ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, జిల్లా మెడికల్ ఆఫీసర్ డా.శంతను పాఢి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో తదితరులు పాల్గొన్నారు.