
నిరుద్యోగ యువతకు రూ.లక్ష వడ్డీలేని రుణం
పర్లాకిమిడి: స్కిల్ ఒడిశా ఆధ్వర్యంలో గజపతి జిల్లాలో నిరుద్యోగ యువతీ, యువకులకు ‘నమో యూనికార్న్ అసెస్‌మెంట్ స్కీమ్’ కింద రూ.లక్ష రుణాన్ని వడ్డీ లేకుండా ప్రభుత్వం అందజేస్తుంది. దీనికి ఔత్సాహిక నిరుద్యోగ డిప్లమా, పాలిటెక్నిక్ విద్యార్థులు తమ అర్హతలతో బుధవారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. వారికి జిల్లా ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి ఇంటర్వ్యూలు చేపట్టారు. ఈ స్కీమ్ కింద యువతీ, యువకులకు 18 నుంచి 35 సంవంత్సరాలు వయో పరిమితి ఉండాలి.ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మరో పది సంవంత్సరాలు పొడిగింపు ఉంటుంది. నిరుద్యోగ డిప్లోమా, డిగ్రీ విద్యార్థులు తమ గ్రామాల్లో తక్కువ పెట్టుబడితో పిండి మిల్లులు, మొబైల్ రిపేరింగ్, గ్రైండర్స్, మెకానిక్ పనులకు ఈ సోమ్మును వినియోగించుకుంటామని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతీ, యువకులు గుమ్మా, కాశీనగర్, పర్లాకిమిడి, నువాగడ, మోహానా నుంచి తొలిరోజు 21 మంది ఇంటర్వ్యూలకు విచ్చేసినట్టు జిల్లా ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి స్మృతి రంజన్ త్రిపాఠి తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలు గురువారం కూడా జరుగనున్నట్టు డీడబ్ల్యూఓ రైకా తెలియజేశారు.

నిరుద్యోగ యువతకు రూ.లక్ష వడ్డీలేని రుణం