
వారసత్వ కట్టడాలను పరిరక్షించుకుందాం
భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల వారస త్వ విలువల పరిరక్షణలో భాగంగా సాంస్కృతిక పరిరక్షణ, విస్తరణ, సంరక్షణ, యాత్రికుల సౌకర్యా ల రూపకల్పన కార్యకలాపాలపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బుధవారం సమీక్షించారు. స్థానిక లోక్ సేవా భవన్‌లో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఘొటొగాంవ్, జాజ్‌పూర్, ఏకమ్ర క్షేత్రాల ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించారు. కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ తరిణి మాత ఆలయం విస్తరణ రానున్న రెండున్నర ఏళ్ళలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. రాష్ట్ర నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్, అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, నిర్మాణ శాఖ కార్యదర్శి సంజయ్ సింగ్, పర్యటన విభాగం సీనియర్ అధికారులు పాల్గొన్నారు.