
తరుణ ప్రజ్ఞా భారతి ఉత్సవాలపై సమీక్ష
జయపురం: ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షణకు 36 ఏళ్లుగా ఉద్యమిస్తున్న జయపురం తరుణ ప్రజ్ఞా భారతి సంస్థ 37వ ప్రతిష్టా ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు సంస్థ ప్రతినిధులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రసాదరావుపేటలోని అమూల్య ఆయుర్వేదిక్ కేంద్రంలో తరుణ ప్రజ్ఞా భారతి జయ పురం అధ్యక్షులు తరుణ కిరణ్ త్రిపాఠీ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహంచారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సభ్యులు తీర్మానించారు. తరుణ ప్రజ్ఞా భా రతి ప్రతిష్టా దాత స్వర్గీయ డాక్టర్ గంగాధర నందో ఆశయాలకు అనుగుణంగా ఎప్పటిలాగనే సూర్య న మస్కారాలు, యోగాసనాలు, శంఖ నాధం, హులీ హులి, గీతా పఠనం, శ్లోకాల పఠనం, ప్రబంధాలు, వ్యాసరచన, సంస్కృతంలో పరీక్షలు, ముగ్గులు, పిల్లల పాటలు, చిత్ర లేఖనం, దేశభక్తి పాటలు, సంగీతం, ఒడిస్సీ జానసద నృత్యాలు, విలువిద్య మొ దలగు పోటీలను అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థు లు, సాధారణ ప్రజలను, మహిళలు, పురుషులు, పిల్లలు, యువతీ యువకులను మమేకం చేయాల ని నిర్ణయించారు. డిసెంబర్ నేలలో నిర్వహించబడే వార్షికోత్సవంలో వివిధ పోటీలలో విజేతలకు బహుమతులతో సత్కరించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రజ్ఞా భారతి కార్యకర్తలు రామ శంకర షొడంగి, అజయ కుమార్ మల్లిక్, రవీంద్ర మహారాణ, సబిత త్రిపాఠీ, తపశ్విణీ సాహు, న్యాయ సలహాదారు న్యాయవాది జి.మహేష్, మొదలగు వారు పాల్గున్నారు.