
స్వశక్తీకరణ, పరివర్తన చాంపియన్‌పై శిక్షణ
పర్లాకిమిడి: స్థానిక జిల్లా పరిషత్ పంచాయతీ రిసో ర్సు భవనంలో బుధవారం సర్పంచ్‌లు, నాయిబు సర్పంచ్‌లకు మూడంచెల పంచాయతీరాజ్ విధానంపై పరివర్థన చాంపియన్ శిక్షణ శిబిరాన్ని జిల్లా పరిషత్తు సీడీవో శంకర కెరకెటా ప్రారంభించారు. ఈనెల 25 వరకూ మూడు రోజుల పాటు జరిగే ఈ నారీ స్వశక్తీకరణ పరివర్తన శిక్షణ శిబిరానికి జిల్లా నలుమూలల నుంచి నాయిబు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు విచ్చేశారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధ, పంచాయతీ రాజ్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జరిగే శిక్షణా శిబిరంలో ఈఆర్‌పీ ట్రైనర్‌గా మలయ మారుతీ దేవి,శ్రేయశ్రీ, సుశీలా మిశ్రా, శుభాంశు శేఖర్ పట్నాయక్ వ్యవహరించారు.