
పరిమళించిన మానవత్వం
నరసన్నపేట:
దాతలు తమ ఔదార్యాన్ని చాటుతూ మానవత్వాన్ని చూపుతున్నారు. నరసన్నపేట మండలం దేవాది కాలనీలో ఆరు నెలల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు దాతలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ నెల 16న ‘దేవాదిలో విషాదం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో బాలికలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. రెండు రోజుల క్రితం కంబకాయకు చెందిన దాతలు రూ.25500 అందించగా.. తాజాగా మంగళవారం సంతబొమ్మాళి మండలం గోవిందాపురానికి చెందిన శ్రీ రేయమ్మతల్లి యూత్(హెల్పింగ్ హ్యాండ్స్) సభ్యులు మరో రూ. 25 వేలు, టెక్కలి చెందిన అభయం సేవా సంఘం సభ్యులు రూ.50 వేలు వితరణ చేశారు. కార్యక్రమంలో అభయం సేవా సంఘం ప్రతినిధులు దేవాది శ్రీనివాసరావు, సింహాచలం, ధర్మారపు పూర్ణారావు, సర్పంచ్ మంతిన రాము తదితరులు పాల్గొన్నారు.