
పారదర్శకంగా సర్వే
గార: బంగారు కుటుంబాలు సర్వే పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రం గారలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్‌తో కలిసి గ్రామసభలో పాల్గొని సర్వే తీరును పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సంక్షేమ కార్యక్రమాలు అమలును అడిగి తెలుసుకున్నారు. కొత్తూరు సైరిగాం వద్ద ఆటోలో యూరియా బస్తాలు వెళ్తుండటంతో వాటి వెనుకనే గ్రామంలోకి వెళ్లి 16 బస్తాలు ఒకేసారి ఎందుకు వెళ్తున్నామని ప్రశ్నించారు. ఎనిమిది మంది రైతులు తెచ్చుకున్నామని తెలియజేశారు. అనంతరం సమీపంలోని ఎంపీయూపీ పాఠశాలను సందర్శించి విద్యార్థుతో ముచ్చటించారు. మౌలిక వసతులపై హెచ్‌ఎం ఆర్.రమణమూర్తితో మాట్లాడగా.. అదనపు తరగతి భవనాలు అవసరమని తెలియజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపీడీఓ ఏ.రఘు తదితరులు పాల్గొన్నారు.