
కోర్టు భవనం ప్రారంభం
పర్లాకిమిడి: ఒడిశా హైకోర్టు చీఫ్ జస్టిస్ హరీష్ టాంటన్ వర్చువల్‌గా గజపతి జిల్లా కాశీనగర్‌లో గ్రామ న్యాయాలయం, జేఎంఎఫ్‌సీ నూతన కోర్టు భవనాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి గజపతి జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
కార్యక్రమంలో జేఎంఎఫ్‌సీ మోనాలీ బెహరా, రిజిస్ట్రార్ ప్రసన్న కుమార్ బెహరా, ఎస్‌జే సాహు, పర్లాకిమిడి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిత్తు పట్నాయక్, సభ్యుడు ఎం.పృథ్వీరాజ్, న్యాయవాదులు పంటల ప్రసాదరావు, ఏకే పండా, ప్రభుత్వ న్యాయవాది శైలాడ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.