
నవజీవన ఆశ్రమంలో తనిఖీలు
గార: మౌలిక వసతుల కల్పనతో పాటు పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా నిర్వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. మంగళవారం శ్రీకూర్మంలోని నవజీవన ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. విద్యార్థుల హాస్టల్, తరగతి గదులు, వంటశాల పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేపట్టారు. ఏమైనా సమస్యలుంటే పరిశీలనకు వచ్చే అధికారులకు తెలియజేయాలన్నారు.
కార్డన్ సెర్చ్ కలకలం
టెక్కలి రూరల్: టెక్కలి మండల కేంద్రంలోని గొల్లవీధిలో సీఐ ఎ.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులు, నిషేధిత పదార్థాలకు సంబంధించి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్టేషన్‌కు తరలించారు. కాగా, ఇతర పత్రాలు సక్రమంగా ఉన్నా సీ బుక్‌లో ఉన్న వ్యక్తి లేకపోయినా వాహనం తీసుకువెళ్లిపోయారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
శభాష్ అయ్యవార్లు!
జి.సిగడాం: మండలంలోని కొత్తపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పొగిరి పండు అప్పలనాయుడు, మక్క లక్ష్మునాయుడు, వి.మమత స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో కాకుండా అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి అభినందనలు అందుకుంటున్నారు. వీరి పిల్లలు పొగిరి నూతన్‌కుమార్(6వ తరగతి), మక్క మోక్ష వర్షిణిచ, వేదిత్‌లను కొత్తపెంట స్కూల్లోనే చేర్పించడంతో ప్రధానోపాధ్యాయులు ఎస్.భానుమూర్తి, వి.రవి, గ్రామస్తులు అభినందించారు.
కర్షకులకు కొనసాగుతున్న కష్టాలు
● ఎరువుల కోసం తప్పని పాట్లు
కొత్తూరు: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. కొత్తూరు రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం 20 టన్నులు యూరియా కేటాయించింది. తక్కువ మొత్తంలో రావడంతో రైతులు రెండు రోజులుగా ఆర్‌ఎస్‌కేల చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం యూరియా విక్రయిస్తారని గ్రామ వ్యవసాయ సహాయకులు చెప్పడంతో పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. అడంగల్ పత్రాలు ఉన్న రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తామని చాలామంది నిరాశతో వెనుతిరిగారు.
పెన్‌కాక్‌సిలాట్‌లో పతకాల పంట
శ్రీకాకుళం న్యూకాలనీ: సౌత్‌జోన్ నేషనల్స్ పెన్‌కాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులోని త్రిచి జిల్లాలో ఉన్న కొంగునాడు ఇంజినీరింగ్ కాలేజీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు 6వ సౌత్‌జోన్ పెంకాక్‌సిలాట్ పోటీలు జరగగా.. అంధవరపు సాయి ప్రశాంత్, దున్న సుచెరిత, కొండేటి హరీష్, బంగారు పతకాలు సాధించారు. దున్న సుమన, రెడ్డి యోగామృత, అంధవరపు లలిత్‌మిదిన్, పి.షాన్, కె.దీక్సిత రజత పతకాలు, బి.నాగేశ్వరి, బి.జ్యోతి సాయి ప్రసాద్, సాన సుజిత్ శంకర్, ఎస్.సహస్ర, బి.కార్తికేయ, పి.పవన్, పి.రాకేష్ నాయుడు, మండా రామ్‌సాయి, విహాన్ శర్మ కాంస్య పతకాలు సాధించారు. వీరిని పెన్‌కాక్‌సిలాట్ సంఘ జిల్లా అధ్యక్షులు రేగిడి దయమయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడు, శ్రీ పరశురామ యుద్ధకళా క్షేత్రం కోచ్ లింగాల ఈశ్వర్‌రావు అభినందించారు. హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ హేమంత్ యాదవ్, హరీష్ పాల్గొన్నారు.

నవజీవన ఆశ్రమంలో తనిఖీలు

నవజీవన ఆశ్రమంలో తనిఖీలు

నవజీవన ఆశ్రమంలో తనిఖీలు

నవజీవన ఆశ్రమంలో తనిఖీలు