
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధి ఎంపీవీ 83 గ్రామానికి చెందిన పింటు సాన (29) అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో విద్యుత్ షాక్‌తో సోమవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పింటు వరంగల్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అతను డ్యూటీ సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం అనంతరం పింటు మృతదేహన్ని మంగళవారం ఉదయం స్వగ్రామానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మృతుడి భార్య గర్భవతి కావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
బాలుడి దత్తత
పర్లాకిమిడి: కటక్ జిల్లాకు చెందిన దంపతులు స్థానిక కలెక్టరేట్ నుంచి 12 ఏళ్ల బాలుడిని అదనపు జిల్లా మాజిస్ట్రేటు ఫాల్గునీ మఝి చేతులమీదుగా మంగళవారం దత్తత తీసుకున్నారు. అనాథ శిశువును శిశు సంక్షేమ సమితి అదేశాల మేరకు ఉత్కళ బాలశ్రమంలో ఉంచి సంరక్షించారు. ఈ బాలుడిని కేంద్ర దత్తత పౌష్యకేంద్రం పోర్టల్‌లో చూసి కటక్‌కు చెందిన దంపతులు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు జిల్లా నుంచి 72 మంది శిశువులను దేశ, విదేశాల దంపతులకు దత్తతగా అందజేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ అశ్వినీ కుమార్ మహాపాత్రో, శిశు సంక్షేమ శాఖ సభ్యురాలు మమతా శతపతి, జిల్లా శిశు సంరక్షణాధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, ఉత్కళ బాలాశ్రమం కార్యకర్తలు పాల్గొన్నారు.
డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల పరిధిలోడిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు వర్శిటీ పరీక్షల యూజీ డీన్ డాక్టర్ జి.పద్మారావు మంగళవారం తెలిపారు. రెగ్యులర్ విధానంలో 6,972 మందికి గాను 42.47 శాతం మంది, సప్లిమెంటరీలో 4,837 మందికి గాను 55.53 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం బొత్తాడిసింగి గ్రామానికి చెందిన గుమ్మడి రామకృష్ణ (44) పాముకాటుకు గురై సోమవారం రాత్రి మృతి చెందాడు. రామకృష్ణ భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసేందుకు పొలానికి వెళ్లారు. రామకృష్ణ పని చేస్తుండగా పాము కాటు వేయడంతో వెంటనే ఎల్‌ఎన్‌పేట పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈయనకు భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జీతాల సమస్య
పరిష్కరించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్‌ఎంలు, టీచర్లు, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు జీతాల చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి త్వరితగతిన జీతాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్‌జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్‌మోహన్, ప్రధాన కార్యదర్శి ఎస్.వి.అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి