
నూతన ప్రతిజ్ఞ విధానం అమలు
కొరాపుట్: నబరంగ్‌పూర్ మహిళా విద్యాలయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూతన ప్రతిజ్ఞ విధానం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. కళాశాల ప్రాంతంలో శాంతి భద్రతల విషయంలో అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి సమాజంలో అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ముందుకు సాగాలన్నారు. కళాశాలలో ఉన్న యువతీ, యువకులు సామాజిక పరిరక్షణ కోసం కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాలేశ్వరి సాహు, అధ్యాపకులు సంజుక్తా పండా, ఉపేంద్ర ఖొస్లా, ఎన్.ఎన్.ఖోస్లా, రంజితా ప్రహరాజ్, సైరా బేగం తదితరులు పాల్గొన్నారు.