
మైనర్ బాలికపై లైంగిక దాడి
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో ఒక మైనర్ బాలికపై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మల్కన్‌గిరి పోలీసుస్టేషన్ పరిధికి చెందిన ఒక బాలిక తన స్నేహితురాలి పుట్టినరోజుకు సోమవారం ఉదయం వెళ్లింది. కానీ సాయంత్రం అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఐఐసీ రీగాన్‌కీండో తన సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. కాగా బిజఘాటీ వద్ద మంగళవారం ఉదయం బాలిక నడవలేని స్థితిలో ఉండడంతో అటుగా వస్తున్న కొంతమంది గమనించారు. అక్కడికి దగ్గరలో ట్రక్ డ్రైవర్‌ను చూసి అనుమానంతో పోలీసులకు తెలియజేశారు. దీంతో వెంటనే పోలీసులు వచ్చి డ్రైవర్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికపై డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం బాలికను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో మండిపడ్డారు. బీజేపీ పాలనలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరగుతున్నాయని దుయ్యబట్టారు.
నలుగురు నిందితులు అరెస్టు