
ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా మాక్‌డ్రిల్
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి సత్‌రంగ్ గ్రామంలో వరద ప్రమాద బాధితుల పునరావాస ఆశ్రమంలో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా మాక్‌డ్రిల్ నిర్వహించారు. కొట్‌పాడ్ సమితి బీడీఓ సంధ్యారాణి సమరత్ అధ్యక్షతన ముందస్తు జాగ్రత్తలపై వివరించారు. ప్రజలను రక్షించేందుకు వినియోగించే యంత్ర సామగ్రి, ఇతర సామగ్రిని ప్రదర్శించారు. వాటిని ఎలా వినియోగించాలో మాక్‌డ్రిల్ చేసి చూపించారు. కార్యక్రమంలో సీడీపీఓ శ్రీమతి సుమిత్ర దేవి త్రిపాఠీ పిఇఓలు అజిత్ కుమార్ నాయిక్, సుధాంశు రథ్, రంజిత్ నాయిక్, గణేష్ కులదీప్, రశ్మితా దాస్, మురళీ పట్నాయిక్, మమత భొత్ర తదితరులు పాల్గొన్నారు.
కొరాపుట్: ప్రకృతి విపత్తులపై శుక్రవారం కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బలియా గ్రామ పంచాయతీ లోని తుఫాన్ విపత్తుల రక్షణ భవనం వద్ద మాక్‌డ్రిల్ నిర్వహించారు. గ్యాస్ సిలెండర్ అగ్ని ప్ర మాదం నుంచి ఎలా తప్పించుకోవాలో చూపించా రు. సీపీఆర్‌పై గిరిజనులకు అవగాహన కల్పించారు.

ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా మాక్‌డ్రిల్

ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా మాక్‌డ్రిల్

ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేలా మాక్‌డ్రిల్