సాయమందిస్తే.. సత్తా చాటుతా
జయపురం: తాను ఉన్నత విద్యనభ్యసించేందుకు దాతలు సాయం చేయాలని కొరాపుట్ జిల్లాలోని లక్ష్మీపూర్‌కు చెందిన పద్మిణీ ఖొర అభ్యర్థిస్తోంది. విద్యార్థిని +2 పరీక్షల్లో 94.4 శాతం మార్కులు సాధించింది. పై చదువులు చదివేందుకు ఆమె కుంటుబానికి ఆర్థిక స్తోమత లేదు. తాను డిగ్రీ పూర్తిచేసి సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని భావిస్తోందని పేర్కొంటోంది. విద్యార్థిని తండ్రికి మూడేళ్ల క్రితం బ్రైన్ స్ట్రోక్ రావడంతో, తల్లి కష్టపడుతూ అతికష్టం మీ ద కుంటుబాన్ని పోషిస్తోంది. ఇంట్లో ముగ్గు రు ఆడ పిల్లలు ఉండగా కేవలం పద్మిణీ ఖిలో మాత్రమే చదువుతోంది. దాతలు స్పందించి తనకు సాయమందిస్తే.. సత్తా చాటగలనని పేర్కొంది.
ఉన్నత చదువుల కోసం విద్యార్థిని అభ్యర్థన


