
బ్యాంక్ సేవలపై సమీక్ష
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితిస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమవేశం శనివారం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించటంతో పాటు లబ్ధిదారులకు పథకాల ఫలితాలు ఎలా చేరుతున్నది, సబ్సిడీ పొందుతున్నారా లేదా, రుణాన్ని సకాలంలో లబ్ధిదారులు చెల్లిస్తున్నారా లేదా అనే విషయాలపై కమిటీ చర్చించింది. కొట్‌పాడ్ బ్లాక్ మేనేజ్‌మెంట్ యూనిట్ అధికారి గుప్త ప్రసాద్ మఝి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి బీడీవో బిక్రమ కుమార్ దొర, సమితి చైర్మన్ కమళ లోచన భొత్ర, కొట్‌పాడ్ సమితి స్థాయి బ్యాంకర్ల కమిటీ వైస్ చైర్మన్ తపన కుమార్ పాణిగ్రహి, ఐపీవో నిరంజన్ పండ, తాపస దాస్, దేవీ ప్రసాద్ త్రిపాఠీ, కొరాపుట్ లీడ్ బ్యాంక్ మీనేజర్ (ఎల్‌డీఎం) డి.కె.త్రిపాఠీ, జీపీవో కేధార్ నాథ్ అటక, సువర్ణ నాయిక్, బిమళావతి సమరత్, రంజిత నాయిక్, ఉజ్వళ ఆశా, నిర్మళఽ దన్‌ఫూల్, నమిత నాయిక్‌తోపాటు తొమ్మిది బ్యాంకుల పరిపాలన అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.