
ఎనిమిదేళ్ల విద్యార్థినిపై అఘాయిత్యం
కొరాపుట్: జిల్లాలోని లమ్తాపుట్ సమితి గున్నయిపుట్ భగ్గుమంది. ఇక్కడి ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదేళ్ల విద్యార్థినిపై లైంగికదాడి జరిగినట్లు ఆలస్యంగా వెలుగు చూడడంతో రాజకీయ నాయకులు గ్రామానికి తరలివచ్చారు. ఏప్రిల్ 13న అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు ఆశ్రమ పాఠశాలలోనే బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసిన ప్రధానోపాధ్యాయురాలు భానుప్రియ రహస్యంగా ఉంచారు. 30న స్కూల్‌కు సెలవులు రావడంతో బాలిక ఇంటికి వచ్చింది. రక్తం మరకలు చూసి తల్లి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్ ఇది అత్యాచారమని పోలీసులకు సమాచారం ఇస్తే గానీ వైద్యం చేయలేనని చెప్పాడు. దీంతో బాధితులు మాచ్‌ఖండ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం బయటకు తెలియడంతో ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు. దీంతో అధికారులు స్పందించి దారుణాన్ని దాచిపెట్టిన హెచ్‌ఎంను సస్పెండ్‌చేశారు. ఘటన జరిగిన ప్రాంతం కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం పొడాల్ స్వగ్రామం ఉన్న పంచాయతీ కావడం విశేషం. అంతేకాక ఘటన జరిగిన రోజు గ్రామంలో ఉత్సవం జరిగిందని, ఆ ఉత్సవంలో ఎమ్మెల్యే తన సహచరులతో కలసి పాల్గొన్నారని బీజేడీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రఘురాం పొడాల్ ఆరోపించారు.
తరలి వెళ్లిన రాజకీయ పక్షాలు
ప్రతి పక్ష బీజేడీకి చెందిన రాజకీయ ప్రముఖులు బాధిత బాలిక ఇంటిని సందర్శించారు. 24 గంటలలో నేరస్తులను అరెస్ట్ చేయకపోతే రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మెహన్ మాఝి ప్రభుత్వం వచ్చాక 160 మందికి పైగా అత్యాచారానికి గురయ్యారని తెలిపారు. తక్షణం సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆశ్రమ పాఠశాలలోనే లైంగికదాడి
భగ్గుమన్న రాజకీయ పార్టీలు