గంజాయి అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

గంజాయి అక్రమ రవాణా

Apr 15 2025 1:56 AM | Updated on Apr 15 2025 1:56 AM

గంజాయ

గంజాయి అక్రమ రవాణా

● అన్నదమ్ములు అరెస్టు

కొరాపుట్‌: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం కొరాపుట్‌ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో విశాఖపట్నం వెళ్లడానికి కిరండోల్‌ రైలు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగుల్లో తనిఖీలు చేపట్టగా 20 కేజీల గంజాయి పట్టుబడింది. వీరిద్దరూ జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన విశాల్‌ దుబే, భరత్‌ దుబేలుగా గుర్తించారు. వీరు సిమిలిగుడలో గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

రక్తదాన శిబిరం

కొరాపుట్‌: జిల్లా కేంద్రంలో బీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. శిబిరాన్ని బీఎస్‌ఎఫ్‌ సెక్టార్‌ కేంద్రంలో డీఐజీ సత్యవాన్‌ ప్రారంభించారు. గత 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నక్సల్స్‌ వ్యతిరేక పోరాటంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు చేసిన త్యాగాలు మరువలేనివన్నారు. వారి త్యాగాలు మరింత ముందుకు తీసుకొని వెళ్లడానికే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. మొత్తం 50 మంది జవాన్లు రక్తదానం చేశారు.

జయపురం వచ్చిన అఖండ దీపం

జయపురం: హరిద్వార్‌ శాంతికుంజ్‌ గాయిత్రీ తీర్థం ద్వారా పరిక్రమిస్తున్న అఖండ దీపం రథం సోమవారం జయపురం చేరుకుంది. మల్కన్‌గిరి నుంచి జయపురం చేరిన అఖండ దీపానికి భక్తులు ఘన స్వాగతం పలికారు. హరిద్వార్‌ శాంతికుంజ్‌ గాయిత్రీ తీర్థంలో 1926లో ఏర్పాటు చేసిన ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉంది. ఇది 2026 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటుదని అఖండ దీప రథంతో సోమవారం జయపురం వచ్చినవారు తెలియజేశారు. అనంతరం నవరంగపూర్‌ మీదుగా కలహండి వెళ్తుందని వెల్లడించారు.

ముగిసిన గంగమ్మ తల్లి ఉత్సవాలు

జయపురం: పట్టణంలోని గంగమ్మ తల్లి ఘటజాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 7వ తేదీన పూర్ణఘడ్‌ గంగమ్మ మందిరం నుంచి అంచమాల తీసుకోని రావడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయని కమిటీ సభ్యులు తెలియజేశరాఉ. ఆరోజు నుంచి అమ్మవారు భక్తుల నుంచి పెద్ద ఎత్తున పూజలందుకున్నారు.

100 కిలోల గంజాయి పట్టివేత

మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా ఎకై ్సజ్‌ పోలీసు అధికారి బింభధర్‌ పండా ఆదేశాలతో సోమవారం మల్కన్‌గిరి ఎకై ్సజ్‌ పోలీసులు చలాన్‌గుడ పంచాయతీ రహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఓ ఆటో అతివేగంగా రావడంతో ఆపి తనిఖీ చేయగా గంజాయి బస్తాలు కనిపించాయి. వెంటనే స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నీలాపరి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ ఖోరగా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి తూకం వేయగా 100 కిలోలు వచ్చింది.

గంజాయి అక్రమ రవాణా 1
1/4

గంజాయి అక్రమ రవాణా

గంజాయి అక్రమ రవాణా 2
2/4

గంజాయి అక్రమ రవాణా

గంజాయి అక్రమ రవాణా 3
3/4

గంజాయి అక్రమ రవాణా

గంజాయి అక్రమ రవాణా 4
4/4

గంజాయి అక్రమ రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement